అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ నవంబర్ 16- చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు నవంబర్ 21 22 23 తేదీలలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అశోక్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 19వ తేదీ లోపు తమ తమ టీం పేర్లను స్థానిక పోలీస్ స్టేషన్ నందు నమోదు చేసుకోగలరు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఎస్పీ డాక్టర్ వినీత్ జి చేతులమీదుగా అందించడం జరుగుతుంది. క్రీడాకారులకు భోజన సదుపాయం కూడా కలదు. కావున ఆసక్తి గల క్రీడాకారులు తమ టీం పేర్లను 19వ తేదీ లోపు నమోదు చేసుకోగలరని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అశోక్ తెలిపారు.
.
Aksharam Telugu Daily